న్యూకెల‌డోనియాలో భూకంపం, సునామి హెచ్చ‌రిక‌లు జారీ!

earth quake in new calodonia
earth quake in new caledonia

న్యూ కెలడోనియాః న్యూకెల‌డోనియా తూర్పుతీరంలో భారీ భూకంపం సంభ‌వించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు అయినట్లు సమాచారం.దీంతో పాటు సునామి హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్కడ సముద్రంలోని అలలు ఐదడుగుల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. సునామీ వల్ల 300 కిలోమీటర్ల పరిధిలో విధ్వంసం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. న్యూ కెలడోనియాలో తూర్పు తీరానికి 250 కిలోమీటర్ల దూరంలో ఆ దేశ రాజధాని నౌమియో ఉంది. న్యూ కెలడోనియాలో ఆదివారం అర్థ రాత్రి నుంచి పలుమార్లు భూమి కంపించింది. సునామీ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చ‌ర్య‌లు ప్రారంభించింది.