నో స్మోకింగ్ నిబంధన నినాదానికేనా?:
ప్రజావాక్కు

నో స్మోకింగ్ నిబంధన నినాదానికేనా?: -జి.అశోక్, గోదూర్, జగిత్యాలజిల్లా
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) బస్సుల్లో ‘నో స్మోకింగ్ నిబంధన నినాదానికే పరిమితమయింది. ఈ నిబంధనను అటు ఆర్టీసీ ఉద్యోగులు కానీ, ఇటు ప్రయాణికులు కానీ పట్టించుకోవడం లేదు. రద్దీగా ఉన్న బస్సుల్లో కూడా కొందరు బీడీలు, సిగరెట్లు కాలుస్తున్నారు. ఇది ఇతర ప్రయాణికులకు ఎంత ఇబ్బందికరమో పొగరాయుళ్లు ఆలోచించడం లేదు. ముఖ్యంగా ఆర్డినరీ బస్సుల్లో పొగ తాగేవాళ్లు ఎక్కువగా కని పిస్తుంటారు. ఇకనైనా పొగత్రాగరాదు. నిబంధనను ఆర్టీసీ సిబ్బంది కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి.
ఆహారభద్రత మనుగడ ప్రశ్నార్థకం:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్ల్లా
ఈ సంవత్సరం నుండి పంటలకు కనీస గిట్టుబాటు ధరను 20 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్ష ణీయం.పంటల సగటుఉత్పాదకత,దిగుబడిపెంచకపోతే దానికి ఆహారభద్రత మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నది. 2050 నాటికి దేశీయంగా ప్రజలకు సరిపడినన్ని ఆహార గింజలను ఉత్పత్తి చేసేందుకు ఇప్పుడున్నభూముల్లో 50శాతం అదనంగా పండించాలని జాతీయ వ్యవసాయ పరిశోధ నసంస్థ స్పష్టం చేసింది.ఇందుకు రైతులకు పెట్టుబడిసాయంగా ఎకరానికి కనీసం నాలుగువేల రూపాయలను ప్రభుత్వం అందించాలి.
కనీస విద్యార్హత తప్పనిసరి: -సి.హెచ్.సాయిరుత్విక్, నల్గొండ
తెలంగాణ రాష్ట్రంలో గడువ్ఞ ముగిసిన వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రక టించడం హర్షణీయం. స్పెషల్ ఆఫీసర్లు, ఇన్ఛార్జీలు, డెవలప్మెంట్ ఆఫీసర్ల కంటే ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే ప్రజాసంక్షేమపట్ల చిత్తశుద్ధితో కృషి చేస్తా రన్నది నిర్వివాదాంశం. అయితే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు పదవతరగతి కనీస అర్హతగా నిర్ణయించి చట్ట సవరణ చేయాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి విద్యార్హత లేకుండా నిరక్షరాస్యులు సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా తమపలుకుబడితో,రాజకీయ పార్టీల అండదం డలతో ఎన్నికవుతున్నారు.ప్రభుత్వ పథకాలు, విధులు, ఆదాయవ్యయపట్టికల విశ్లేషణలు ఇత్యాది విషయాల పట్ల కనీస అవగాహన లేకపోవడం వలన తమ విధులను సక్ర మంగా నిర్వహించలేకపోవడమే కాకుండా ప్రభుత్వ పథకా లను ప్రజల్లోకి తీసుకుపోవడంలో విఫలమవ్ఞతున్నార
ఇవియంలపై అవగాహన : -సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
ఎన్నికలవ్ఞతున్న ప్రతిసారీ గ్రామీణ ప్రాంతాలలో నిరక్షరాస్యు లైన ప్రజలకు, వివిధ జబ్బులతో బాధపడుతున్నవారికీ, వృద్ధులకూ ఇ.వి.ఎం.మిషన్లపై అవగాహనలేక నానా తంటాలు పడుతున్నారు. వాటిని ఎలావాడాలో తెలియడం లేదు. దీనితో అనేక ఓట్లు దుర్వినియోగం అవ్ఞతున్నాయి. ఈ సమస్యను నివారించాలంటే డమ్మీ ఇ.వి.ఎంలను తయారు చేసి, ఇంటింటా తిరుగుతూ వాటిని ఎలా వినియోగించాలో అందరికీ అవగాహన కల్పించాలి.
అధికారులపై ఆరోపణలు తగవు : -టి.సురేష్‌కుమార్, శ్రీకాకుళం
ఈమధ్య రాజకీయ నాయకుల ఆరోపణలు వ్యాఖ్యలు హుందా తనం వీడి, చాలా బాధ్యతారహితంగా ఉద్రేకపూర్వకంగా ఉండ టం ప్రజలు గమనిస్తున్నారు. వాస్తవికాంశాల్ని వదిలివేసి వ్యక్తి గత ఆరోపణలు, దూషణలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రజ లలో సదరు నాయకులపై, పార్టీపై వ్యతిరేక భావన, ఏవగింపు కలిగేలా చేస్తుంది. కానీ ప్రజల శ్రేయస్సుకై శ్రమిస్తున్న అధికా రులపై ఆరోపణలు చేయడం సదరు రాజకీయ నాయకులకీ వారి పార్టీకి మంచిదికాదు.
తమిళనాట కొత్త పార్టీకి ఆదరణ: -బి.ఎన్.సత్యనారాయణ, హైదరాబాద్
ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ప్రారంభించిన ‘మక్కల్ నీది మయ్యం రాజకీయ పార్టీకి తమిళుల ఆదరాభిమానాలు దక్కవచ్చు. ఎమ్జిఆర్, జయలలితల వంటి మహామహుల ప్రభావం అతడిని రాజకీయంలో ఎదిగేందుకు దోహదపడ తాయని భావించవచ్చు. ద్రవిడ సిద్ధాంతాలను పాటిస్తామ ని ఆయన ప్రకటించడం ఎంతో ఉన్నతంగా ఉంది. కేంద్రం నిరంకుశంగాను, మతోన్మాదంతో దక్షిణాది రాష్ట్రాల పట్ల చూపుతున్న వివక్షకు చక్కని గుణపాఠం చెప్పేదిగా ఉంది.
అందరూ ఆదర్శనీయులే: -ఈదర శ్రీనివాసరెడ్డి, గుంటూరుజిల్లా
ఆధార్ కార్డులు లేక రేషన్ సరుకులు రాక ఆకలితో అలమటి స్తూ ప్రాణాలు వదులుతున్న అట్టడుగు అభాగ్యులుకారా అమర వీరులు. బ్యాంకు ఖాతాలు లేక పెన్షన్ డబ్బులు రాక చేతిలో చిల్లిగవ్వలేక మందులు లేక మరణిస్తున్న అవ్వ,తాతలు కారా ఆదర్శవంతులు.గిట్టుబాటు ధరలులేక రుణమాఫీలు రాక అప్పు లతో అవమానంపాలై అసువ్ఞలు బాస్తున్న అన్నదాతలు కారా త్యాగధనులు.ఇలాచెప్పుకుంటూపోతేఅందరూ ఆదర్శవంతులు.