నోవోనోర్డిస్క్ ప్రచారకర్తగా సచిన్ తెందూల్కర్
హైదరాబాద్ : మధుమేహ వ్యాధి నివరాణ ఉత్పత్తులు తయారు చేస్తున్నడయాబెటిస్ కేర్ కంపెనీ నోఓవోనోర్డిస్క్కు ప్రచారకర్తగా క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ నియమితులయ్యారు. మధుమేహం వ్యాధిపట్ల అవగాహన, నివారణకు చైతన్యం కలిగించే కార్యక్రమాలకు నోవోనోర్డిస్క్ ప్రణాళికలకు సచిన్ ప్రచారకర్తగా ఉంటారు. ఛేంజింగ్ డయాబెటిస్ అనేది ఈ చికిత్సద్వారా మధుమేహం వల్లకలిగే మానసిక ఆందోళనలకు పరిష్కారం అందిస్తూనే ప్రజల జీవితాలను వృద్ధి చేసేందుకుని తెలుస్తోంది. సాలీనా 123.5 మిలియన్ల మంది ఈరోగం బారిన పడుతున్నారని, రూల్‌ఆఫ్ హాల్వ్స్ ప్రకారం 35మిలియన్ల మందిప్రజలకు తమ డయాబెటిస్ ఉన్నట్లు తెలియదని నోవోనోర్డిస్క్ ప్రతినిధులతో కలిసి సచిన్ వెల్లడించారు. సోమవారం నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మధుమేహంపై పోరాటానికి సచిన్ తమతో కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు కంపెనీ వైస్‌ప్రెసిడెంట్ మెల్విన్ డిసౌజా పేర్కొన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలపై మధుమేహం తీ వప్రభావం చూపిస్తోందని, వయోజనుల్లో 6.2శాతం ఉన్నప్పటికీ కేవలం 6-7 మిలియన్ల మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. సక్రమ చికిత్స తీసుకోకపోవడం వల్లగుండెపోటు, రక్తపోటు, కిడ్నీఫెయిల్యూర్, డయా బెటిక్ రెటినోపతి వంటి వాటితోపాటు ఒకోకసారి ఆకస్మిక మరణం కూడా సంభవిస్తుందని డిసౌజా వెల్లడించారు. మధుమేహ నివారణకు నోవోనోర్డిస్క్తో భాగస్వామి కావడం ఎంతోసంతోషంగాఉందని సచిన్ తెందూల్కర్ పేర్కొ న్నారు. డెన్మార్క్‌లో కేంద్ర కార్యాలయం ఉనన నోవోనోర్డిస్క్కు 79 దేశాల్లో 25,350 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, 179 దేశాల్లో కంపెనీ ఉత్ప త్తులు మార్కెట్ అవుతున్నట్లు వైస్‌ప్రెసిడెంట్ వెల్లడించారు. కొపెన్హ్యాగన్, లండన్ స్టాక్ ఎక్ఛేంజిల్లో కంపెనీ షేర్లు జాబితా అయినట్లు తెలిపారు.