నోకియా నిర్ణయం పట్ల ట్రేడ్‌ యూనియన్ల ఆందోళన

NOKIA
NOKIA

నోకియా నిర్ణయం పట్ల ట్రేడ్‌ యూనియన్ల ఆందోళన

న్యూఢిల్లీ,సెప్టెంబరు 8: నోకియా తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులను తగ్గించాలని తీసుకున్న నిర్ణ యంపై ట్రేడ్‌ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వ్యయాల తగ్గించుకోవడానికి టెలి కాం దిగ్గజం నోకియా ఉద్యోగులపై కోత విధి స్తుంది. ప్రాన్స్‌లో సుమారు 600 మంది ఉద్యో గులను తీసివేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు నొకియా వెల్లడించింది. ఈ ఉద్యోగాల కోతతో పాటు నష్టా ల్లో ఉన్న వ్యాపారాలై కూడా దృష్టిసారించాలని చూస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రాన్స్‌లో 597 మంది ఉద్యోగులను తగ్గించాలని ప్లాన్‌ చేస్తున్నా మని, మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఇది 10 శాతమని గ్రూపు తెలిపింది. నొకియా తీసుకున్న ఈ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని ఫ్రెంచ్‌ ట్రేడ్‌ యూనియన్లు సిఎఫ్‌డిటి, సిఎఫ్‌ఇ,-సిజిసి, సిజిటి, సిఎఫ్‌టిసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ వద్ద తమ గోడు వెల్లబుచ్చుకోను న్నట్లు తెలిపాయి.

సమస్యను పర్యవేక్షించడానికి యూనియన్‌, సంస్థ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేశామని, మరికొని వారాల్లో కమిటీని సమావేశ పరచబోతున్నట్లు ఆ దేశ మంత్రిత్వశాఖ పేర్కొంది. అల్కాటెల్‌-లుసెంట్‌ ఇంటర్నేషనల్‌, నోకియా సాల్యూషన్స్‌ నెట్‌వర్క్‌ ప్రాన్స్‌లలో ఈ ఉద్యో గాల కోత ఉండబోతుంది. వీటిలో మొత్తం 4200 మంది ఉద్యోగులున్నారని నోకియా అధి కారి ప్రతినిధి వెల్లడించారు. ఈ ఉద్యోగాల కోత ప్లాన్‌ నుంచి ఆర్‌ అండ్‌ బి కార్యకలాపాలను మిన హాయించారు.హై స్పీడు 5జి టెలికాం నెట్‌ వర్క్‌,సైబర్‌ సెక్యురిటి,ఇంటర్నెట్‌లో లింక్‌ అయిన అప్లియన్స్‌లపై కంపెనీ పున: దృష్టిసారించాలని చూస్తుందని గ్రూపు తెలిపింది. 2018 చివరి వరకు మొత్తం వ్యయాల్లో 1.4 బిలియన్‌ డాలర్లను పొదు పు చేసుకోవాలని నోకియా టార్గెట్‌గా పెట్టుకుంది.