నొప్పించని మాట

అంతర్వాణి

 

jesus
jesus

నొప్పించని మాట

ఇటీవల ఒక సేవకుడి సవాలుతో కూడిన ఒక ప్రకటనను చూసాను. అందులో తోటిసహోదరులను గూర్చి సంబోధిస్తూ కొన్ని వాడకూడని పదాలను ఉపయో గిస్తూ, తిడుతూ, సవాలును విసిరాడు. ఆ పదాలను చదివేందుకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ సేవకుడి బోధనావిధానం కూడా ఇలాగే వ్ఞం టుంది. ఇతరులను తిడుతూ, అభ్యంతరకరమైన పదాలతోను, సవాలుతోను ఆయన ప్రసంగాలు ఉంటాయి. ఎదుటివారు సేవ పేరుతో ఏదో తప్పు చేస్తు న్నారని, మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు.
వారిని తిట్టాల్సిన అవసరం కూడా లేదు. వారికి సవాలు విసరాల్సిన అవసరం అంతకన్నా లేదు.

 

ఏ సేవకుడికైనా, విశ్వాసికైనా, భక్తులకైనా ఒకే ఒక్క ఆదర్శం బైబిల్‌, యేసుక్రీస్తు, ఆయన శిష్యులు.మన పరిచర్యకానివ్వండి లేదా మరొకటి కానివ్వండి ఏదైనా మనం వాక్యానుసారంగా పనిచేయాల్సిందే, వాక్యానుసారంగా ప్రవర్తించాల్సిం దే, వాక్యానుసారంగా జీవించాల్సిందే. ఇందులో రాజీ లేదు.

బైబిల్‌లో దేవుడు అన్నీ ఆజ్ఞలే తప్ప సలహాలు ఇవ్వలేదు. ఏదైనా ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాల్సిందే. ఇదే గొప్ప ధన్యత. సరే మనం భాష గురించి మాట్లాడు కుంటున్నాం కదా..! సేవకులు కానీ, విశ్వాసులు కాని తమ మాటల్లో ఎలాంటి అభ్యంతరకరమైన పదాలను కానీ బూతుమాటల్ని కానీ ఉపయోగించకూడదు. ఒక వ్యక్తి కుమారుడికి మూగదయ్యం పట్టినప్పుడు యేసుక్రీస్తు శిష్యులు ఆ దయ్యాన్ని వదిలించలేకపోతారు. ఆ విషయాన్ని ఆ వ్యక్తి యేసుక్రీస్తుకు చెప్పినప్పుడు ప్రభువ్ఞ ‘విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము విూతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? (మార్కు 9:19) అని అన్నారు.
బహుశా ప్రభువు ఈ మాటలను కోపంతో అన్నారో, అసహనంతో అన్నారో, చిరాకుతో అన్నారో మనకు తెలియదు కానీ శిష్యులపై మాత్రం చిరాకుపడ్డాడు. ఇటువంటి సమయంలో కూడా ప్రభువ్ఞ విశ్వాసం లేని తరము వారలారా? అని ప్రశ్నించారే తప్ప వాడకూడదని పదాన్ని వాడలేదు.

 

దేవాల యంలో క్రయవిక్రయాలు చేస్తున్న వారిని యేసుక్రీస్తు వెళ్లగొట్టాడు, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి, ‘నా మందిరం ప్రార్థన మందిరమనబడును (మత్తయి 21:12) అని అన్నారు.
బహుశా ఇక్కడ యేసుప్రభువుకు కోపం వచ్చివ్ఞండవచ్చు. కోపంతో ఆయన బల్లలను, పీఠాల ను పడద్రోసాడు. అయినా కూడా ప్రభువ్ఞ ప్రజలను దూషించలేదు, తిట్టలేదు. ‘దేవ్ఞని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే యున్నది. విూరేది కోరుచున్నారు? బెత్తముతో నేను విూయొద్దకు రావలెనా? ప్రేమతోను, సాత్వికమైన మనస్సు తోను రావలెనా? (1 కొరింథీ 4: 20,21). పౌలు బెత్తమని ఎందుకు వాడాడు? ఇతను ప్రభువు బిడ్డలను తన సొంత బిడ్డలుగా భావించాడు. సంఘాలను నిర్మించాడు, అనేకులను ఆత్మీయంగా బలపర్చాడు, దేవ్ఞడివైపు తిప్పాడు. విశ్వాసులు భక్తిలో సన్నగిల్లిపోతున్నందుకు సొంత తండ్రిగా బాధతో ‘బెత్తమని వాడాడు.

కానీ విశ్వాసులను అమితమైన ప్రేమతో ప్రేమించాడు. యేసుప్రభు వ్ఞ, పేతురు, పౌలు, యోహాను, ఇతర శిష్యులు ఎవరూ కూడా వాడకూడదని పదాలను వాడినట్లుగా, సంబోధిస్తున్నట్లుగా మనం బైబిల్‌లో చదవవం. మరెం దుకు కొంతమంది సేవకులు వాడకూడదని పదాలను, నొప్పించేమాటలను ఉపయోగిస్తూ, ప్రసంగిస్తుంటారు? వీరికి వాక్యం సరిగ్గా తెలియని అనుకోవా లా? లేక అసలు వీరు దేవ్ఞడి సేవకులు కాదని భావించాలా? కొంతమంది సేవకులు వాక్యాన్ని బోధిస్తూ, సంఘంలో తమకు గిట్టని వారిని, తప్పులు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తుంటారు. వారి మనసు నొచ్చుకునేలా మాట్లాడతారు.

అంటే స్టేజీపై నుంచి కిందకు వాక్యంతోపాటు రాళ్లను విసురు తుంటారు. తమ కసి అంతా వాక్యం ద్వారా తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుం టారు. ఏమైనా అంటే ‘బైబిల్‌ ఉన్నదే చెబుతున్నాను, నా సొంతం కాదని అం టారు. ఇది కూడా సరైన పద్ధతి కాదు. యేసుప్రభువు ప్రేమతో, ఆదరణతో వాక్యాన్ని బోధించారే తప్ప వాక్యం పేరుతో రాళ్లను విసరలేదు. ఒకవేళ విశ్వా సుల్లో ఏమైనా పొరపాట్లు, తప్పులు వ్ఞంటే వారితో నేరుగా ప్రేమతో మాట్లాడి, ఆ తప్పులను వారు సరిచేసుకునే అవకా శాన్ని ఇవ్వాలి.

పేతురు మూడుసార్లు యేసుప్రభువు ఎవరో తెలియదని చెప్పి నా క్షమించాడు. సువార్త సేవను విడిచిపెట్టి చేపలు పట్టేందుకు వెళ్లినా, క్షమిం చి, తిరిగి తన సేవలో గొప్పగా వాడుకున్నాడు. ప్రభువ్ఞ కంటే మనం గొప్ప వారం కాదుకదా? మనం వాక్యాన్ని బోధిస్తున్నాం అంటే ప్రభువ్ఞలో తోటి వారు బలపడాలి. వారు దేవ్ఞడిని హత్తుకుని జీవించేలా చేయాలి. చేసిన తప్పు లను మళ్లీమళ్లీ చేయకుండా వుండేందుకు బలమైన మనోబలాన్ని వారిలో నింపాలి. అంతిమంగా వారు ప్రభువ్ఞకు మహిమకరంగా, ఆ విశ్వాసులు ఆశీ ర్వదకరంగా జీవించేందుకు దోహదపడేలా ప్రసంగాలు, బోధలు ఉండాలి. అంతేతప్ప వాక్యమంతా తెలుసుకదాని తోటివిశ్వాసులను కించపరిచేలా, వారు నొచ్చుకునేలా చెప్పకూడదు. వారిని గద్దించాలంటే వాక్యానుసారంగా, సౌమ్యం గా సరిచేసేందుకు ప్రయత్నించాలి.

సంఘస్తులు తప్పు చేస్తే, వారిని తన సొంతబిడ్డలుగా సరిచేసేందుకు ప్రయత్నించాలి. లేకపోతే దేవ్ఞడికే వారిని వదిలిపెట్టాలి. వారిగురించి మౌనంగా ప్రార్థించాలి. బోధ అంటే విశ్వాసం లేని వారిలో విశ్వాసాన్ని నింపి, వారిని పరలోకవారసులుగా చేయాలి. పడిపో వడం, బలహీనమైపోవడం సహజమే.. అయినా వారిని ప్రేమతో తిరిగి ప్రభు వ్ఞను హత్తుకుని జీవించేలా చేయాలి. అంతేతప్ప అనకూడదని మాటలతో, వాడకూడదని పదాలతో వారి మనసు నొచ్చుకునేలా ప్రవర్తించకూడదు, మాట్లా డకూడదు. దేవ్ఞడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో గ్రహిస్తే, ఆయన సహనం లో మనం కూడా సహిస్తాం.
తప్పులను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తాం. ఇది తండ్రి మనకు ఇచ్చిన బహుమానం. పరిచయర్య చేయడం అంటే దేవ్ఞడు మనకు ఇచ్చిన గొప్ప ధన్యత. ఇదే సేవా విజయంలో ఉన్న గొప్ప రహస్యం. గర్వంతో కాక దీనత్వంతో పరిచర్యను చేద్దాం. ఈ దిశగా ప్రభువ్ఞ సేవను చేసేందుకు దేవ్ఞడు మనకు సాయం చేయునుగాక.

– పి.వాణీపుష్ప