నేల పండుగ

బాల గేయం
                                            నేల పండుగ

RAIN
RAIN

నల్ల నల్లని మబ్బులు
మముజూసి నవ్వాయి
నీటిధారలు భూమిని
ముద్దాడి మురిసాయి
నెర్రలొచ్చిన నేలంతా
వాననీళ్లతో తడిసింది
నాగలితో మా బాపు
పొలమంత దున్నిండు
నాట్లేసిన మా అమ్మ
ముఖమెంతో మెరిసింది
పచ్చపచ్చంగ నేలంత
పండుగలా మురిసింది
– వడ్డేపల్లి సంధ్య