నేలపాడులో ప్రపంచ బ్యాంకు పరిశీలన బృందం

Tullur Mandal NEALAPADU VILLAGE
Tullur Mandal NEALAPADU VILLAGE

 

 

 

 

 

 

 

 

 

నేలపాడులో ప్రపంచ బ్యాంకు పరిశీలన బృందం

తుళ్లూరు:  నేలపాడులో ప్రపంచ బ్యాంకు పరిశీలన బృందం పర్యటిస్తోంది. ఇందులో భాగంగా నేలపాడులో భూ సమీకరణకు మద్దతిస్తున్న రైతులతో బృందం సమావేశమైంది. భూసమీకరణ విధానంపై వచ్చిన ఫిర్యాదులపై నలుగురు సభ్యుల బృందం విచారించింది. భూసమీకరణకు మద్దతిస్తున్నట్లు రాజధాని రైతు పరిరక్షణ సమితి బృందానికి తెలిపింది. కొంత మంది వ్యతిరేకతను పట్టించుకోవద్దని ప్రపంచబ్యాంకు బృందం సభ్యులకు రైతులు విన్నవించారు. కేవలం 250 నుంచి 300 కుటుంబాలు మాత్రమే రాజధానిని అడ్డుకుంటునాయని తెలిపారు. భూసమీకరణలో భూములు ఇవ్వని రైతులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని బ ృందం సభ్యులకు తెలిపారు. రాజధాని అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకరించాలని రైతులు కోరారు.