నేర రహిత తెలంగాణ నా లక్ష్యం

TS DGP MAHINDAR REDDY
TS DGP MAHINDAR REDDY

నేర రహిత తెలంగాణ నా లక్ష్యం

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు విభాగాల పరిధుల్లో ఇక ఏకరూప పోలీసింగ్‌ రాZ వ్యాప్తంగా మరిన్ని చోట్ల సిసి కెమెరాలు, పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు పెద్దపీట కొత్త డిజిపి మహేందర్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, నవంబరు 12, ప్రభాతవార్త: తెలంగాణ రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పోలీసులు శక్తివం చన లేకుండా కృషి చేయాలని నూతన ఇన్‌ఛార్జి డిజిపి ఎం. మహేందర్‌ రెడ్డి అన్నారు. పోలీసు శాఖకు సర్కారు అంది స్తున్న సహాయ సహకారాలను పూర్తిగా వినియోగించుకుని శాంతి భద్రతల పరిరక్షణకు మరింత అంకిత భావంతో పని చేయాలని, ఈ విషయంలో ప్రజలతో పూర్తిగా మమేకం కావాలని అన్ని విభాగాల పోలీసులను ఆయన కోరారు. రాష్ట్ర రెండవ ఇంఛార్జి డిజిపిగా ఆదివారం ఉదయం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన లక్ష్యాలను, చేబట్టపోయే కార్యక్రమాలను, ప్రణాళికలను వివరించారు. డిజిపి

గా తనను నియమించినం దుకు సిఎం కెసిఆర్‌కు మహేందర్‌ రెడ్డి కృతజ్ఞతలు చెబుతూ తనమీద వుంచిన నమ్మకాన్ని వమ్ముచేయబోన ని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో పోలీసు సిబ్బంది కొరత చాలా వరకు వుండేదని, ఇదే సమయంలో అనేక సవా ళ్లు వచ్చాయని, అయితే వున్న సిబ్బంది కష్టించి పనిచేయడం వల్ల సవాళ్లను అధిగమించగలిగామని, ఇదే సందర్భంలో అనేక ఆవిష్కరణలు కూడా జరిగాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు భేషుగ్గా వున్నాయని, ఇదే సమ యంలో నేరాలు కూడా చాలా వరకు తగ్గాయని, ఇదంతా క్షేత్ర స్థాయిలో వుండే పోలీసుల కృషివల్లే జరిగిందని ఆయన కొనియా డారు. ఉమ్మడి ఎపిలో ఒకప్పుడు నక్సలిజం, టెర్ర రిజం సమస్య తీవ్రంగా వుండేదని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పు డు అటువంటి సమస్యలు లేవని ఆయన తెలిపారు. అయిన ప్పటికీ ఈ రెండు అంశాలపై నిరంతరం నిఘా వుంచు తామని, ఈ విషయంలో ఫలితాలు సాధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు పొరుగు రాష్ట్రాల పోలీసు విభాగా లతో కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు.