నేర్చుకోవాల్సినవెన్నో ఉన్నాయి

CUTE--
CUTE

నేర్చుకోవాల్సినవెన్నో ఉన్నాయి

మనం నేర్చుకొనే విద్యలోనే మనల్ని సంస్కరించే అంశాలుంటాయి. విజయం అనే పదాన్ని నిర్వచించడం చాలా కష్టం. జీవితంలో పైకి ఎదగాలనే వ్యక్తి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. మన వ్యవస్థలోని ధర్మసూత్రాలు గౌరవంగా జీవించడం, ఇతరులకు హాని కలిగించకుండా ఉండడం, ప్రతి వ్యక్తికీ ఇవ్వదగిన దానిని ఇవ్వడం. ప్రణాళికాబద్ధంగా ఉండడం, అనుభవాలను అన్వయించుకోవడం, పరిస్థితులను అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. మనం ముందుకు వెళ్లడంతో జీవించాలి. దాన్ని వెనక్కు తిరిగి అర్థం చేసుకోవాలి. ్య సభ్యత కల ఇంటిని మించిన పాఠశాల, చిత్తశుద్ధి గల తల్లితండ్రులను మించిన గురువ్ఞలూ లేరు. వయోవృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యపరిస్తే నీ సంతతి కూడా వారి ముసలి తల్లిదండ్రులను ఉపేక్షిస్తారు. యుక్తవయస్సులో బాధ్యతగా ఉండనివాడు, వృద్ధాప్యంలో ఇబ్బందులు పడతాడు

పాత ‘మీరుగా ఉండటం కంటే కొత్త ‘మీరుగా మారుతూ ఉండటం అభివృద్ధిని సూచిస్తుంది. నిరంతరం మార్పును ఆహ్వానిస్తూ ఉండాలి. ్య జీవితం రెండు రకాలు ఒకటి విలువలు కలది. రెండవది విలువైనది. మానవజాతి మూడు వర్గాలుగా ఉంటుంది. ముందుకు కదలనివారూ, కదిలేవారూ కదిలించేవారు. మన పాదాలు గతంలో, హృదయం వర్తమాన కాలంలో, కళ్లు భవిష్యత్తులోనూ ఉండాలి. సాదాగా ఉండే రుచులనూ, కోరికలనూ, అలవాట్లనూ స్థిరపరచుకుని జీవితాన్ని కూడా సాదాగా గడుపుకోవాలి. జీవితంలో మనకు సఫలత వైఫల్యం, లాభం, నష్టం, సంతోషం, దుఃఖం అనేవి ఒక దానికి ఒకటి నీడలాగ వెంబడిస్తాయనే సత్యాన్ని గ్రహించాలి. ్య డబ్బు చేతిలో మనం చేరకూడదు. డబ్బు మన చేతిలో ఉండాలి. ఒక్కొక్కప్పుడు ధనం కష్టాల్ని నివారిస్తుంది. అత్యధికమైన ధనం కష్టాలను పెంచుతుంది కూడా. అలవాట్లు మనం ఉపయోగించి చేతికర్ర వలే ఉండాలి. కానీ ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు.

మంచి పనిచేసేవాడు ఎప్పుడూ నష్టపోడు. అతనికి ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది. ్య ఆశావహదృక్పథం ఉన్నవాడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. పరిపూర్ణ ఆరోగ్యం పొందిన వారికి అన్నీ సమకూరుతాయి. ఆశావాదంతో గడపటమే అభివృద్ధికి మూలాధారం. మీరు చేయగల్గిన పనులను చేయడం గొప్పకాదు. మీరు చేయలేని పనులను చేయండి. మీరు కష్టాల్లో ఉన్న, ఇతరులకు సాధ్యమైనంత మేలు చేయండి. కొద్దిరోజుల్లో మీలో మంచి మార్పులు మీరు గమనిస్తారు. ఆరోగ్యం ఉన్నవాడి వద్ద నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్న వారి వద్ద సర్వస్వం ఉంటుంది. ్య ఆలోచించుకోవడానికి సమయాన్ని కలుగజేసుకోండి అది శక్తికి ఆధారం. ఆటలాడుకోవడానికి సమయాన్ని కలుగజేసుకోండి అదే యవ్వన ఆరోగ్య రహస్యం. చదవడానికి సమయాన్ని కలుగజేసుకోండి అదే వివేకపు ఊట. స్నేహంగా ఉండటానికి సమయాన్ని కలుగజేసుకోండి అదే ఆనందపు రాచబాట. మనకు తెలిసిన విషయాలలో మంచివాటిని వీలున్నంత ఎక్కువమందికి పంచిపెట్టాలి. కోరుకుంటున్న వారికి పంచే ప్రయత్నం చేయండి. ఉన్నదానికంటే తక్కువగానే కనిపించు. అలాగే తెలిసిన దానికంటే తక్కువగానే మాట్లాడు. మన జీవితాల్నే కాదు. మనచుట్టూ ఉన్నవారి జీవితాలలో కూడా కొంత వెలుగును నింపాలి.

్య మనం ఎలాంటి మార్పునైతే ఆశిస్తున్నామో, అలాంటి మార్పు ముందు మనలోనే రావాలి. మంచి హృదయం, మంచి ఆలోచన ఈ రెండూ అద్భుతమైన జ్యోతి లాంటిది. అతిగా ఆలోచించి ఊరికుండి పోవడం కన్నా మితంగానైనా ఆచరించడం హితంగానైనా జీవించడంలోనే విజయాలు దాగి ఉన్నాయి. బాధ్యతారహితమైన మాటలు ఇతరులకు మనపై ఉన్న ప్రేమను తగ్గిస్తాయి. శ్రమ ద్వారానే ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. ప్రపంచంలోని అన్ని భోగభాగ్యాల కంటే మంచి ఆరోగ్యంలో కూడుకున్న సుదీర్ఘజీవితం మంచిది. ్య మెప్పుకు ఉదారంగా, పొగడ్తలకు ఉదాసీనంగా, విమర్శలకు జాగ్రత్తగా ఉండాలి. మన మాటలనూ, చేతలనూ ఆలోచనల్నీ, స్వభావాన్ని, మనస్సునూ సదాగమనించుకుంటూ ఉండాలి. మనబలం కంటే మన ఓర్పు ఎక్కువ సాధిస్తుంది. తలంపు తప్పుదారిపడితే తలవంపు తప్పదు.

మంచిగా మాట్లాడడం మన బాధ్యత. చెడు మాట్లాడకుండా ఉండడానికి మౌనం అవసరం. దీనివల్ల మనకు ఏ నష్టం ఉండదు. మంచి పనులకు పునాది మంచి క్రమశిక్షణే. ్య మనసులో ఎటువంటి కల్మషం లేకుండా మనిషి మనిషిగా జీవించడమే మహనీయత. నిజమైన సంపదంటే ధనం కాదు. మనసు ప్రశాంతంగా ఉండటం అని అర్థం. మౌనానికి మహత్తరమైన శక్తి ఉంది. మంచి ఆలోచనలు, నిర్ణయాలు మౌనం నుండే పుడతాయి. మీ దగ్గర ఉన్నది కాదు మీరు ఉన్నతీరే గొప్ప సంపద. అధిక విశ్రాంతి తీసుకుంటే తుప్పుపట్టిపోతారు. ధైర్యం ఇతర అన్ని గుణాలు మనకు దక్కేలా చేస్తుంది. ధైర్యం మనిషి తొలి మానవగుణంగా గుర్తించబడుతుంది. తమపై తమకు విశ్వాసం లేనివారు తమ శక్తితో విశ్వాసంలేనివారు వారెంత గట్టివారైన బలహీనులే. సానుకూల ఆలోచనలు మానసిక సన్నద్ధత మనస్ఫూర్తి సాధనే విజయానికి తొలిమెట్టు. సంతోషంగా ఉన్నావంటే నీవెంటే ప్రపంచం ఉంటుంది. దుఃఖంలో ఉన్నావంటే నువ్ఞ్వ ఒంటరిగానే మిగిలి పోతావ్ఞ. ఏవేవో అనవసరపు ఆలోచనలు చేయడం కన్నా నీ గురించి నీవ్ఞ ఆలోచించుకోవడమే మేలు. ఏదో జరగాలని ఎదురుచూస్తూ కూర్చుంటే ఓటమి తథ్యం. ఏది చేయాలో నిర్ణయించుకుని ముందుకు సాగితే గెలుపు తథ్యం. ్య మంచి తల్లిదండ్రులవ్వాలంటే ఒక పుస్తకంలోని మొదటిపేజీ చివరిపేజీలూ కలిసికట్టుగా ఉండాలి. విశాల హృదయం గలవారు వివిధ మతాలలోని సత్యసారాన్ని గ్రహిస్తారు. కానీ అల్పబుద్ధి గలవారు మాత్రం ప్రతిచోట తేడాలు వెతుకుతారు.