నేరాలను అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తుంది

kishan reddy
kishan reddy

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌లో సైబర్‌ సెక్యూరిటీ అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త చట్టాలు, టెక్నాలజీతో సైబర్‌ నేరాలను అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. సైబర్‌ నేరగాళ్ల అప్పగింతకు ఇతర దేశాలతోనూ ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలతో కేంద్రం సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు సైబర్‌ క్రైం నేరగాళ్ల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దేశంలో నేరాలను అరికట్టేందుకు స్మార్ట్‌ కార్డ్‌ను ప్రవేశపెట్టాల్సిన అవసరముందన్నారు. సైబర్‌ టెక్నాలజీలో ఎదురువుతున్న సవాళ్లను అధిగమించేందుకు మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముందని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌, పలువురు నిపుణులు హాజరయ్యారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/