నేరచరితులకు ‘ఫుల్‌స్టాప్‌’ ఎప్పుడు?

                        నేరచరితులకు ‘ఫుల్‌స్టాప్‌’ ఎప్పుడు?

CRIME RATE
CRIME RATE

రాజకీయాల్లో నేరచరితులకు స్థానం లేకుండా చేయాలని అన్ని రాజకీయ పార్టీలు పెద్దపెద్ద ప్రకటనలు చేస్తుంటాయి. రాష్ట్రనేతలు మొదలు దేశనేతల వరకు ఉపన్యాసాలు ఇస్తున్నా ఆచరణకు వచ్చే సరికి అందుకు పూర్తిగా విరు ద్ధంగా వ్యవహరిస్తున్నారేమోననిపిస్తున్నది. నేరచరితులకు టిక్కెట్లు ఇవ్వరాదని స్వచ్ఛందసంస్థలు, సంఘాలు, మేధావ్ఞలు, ప్రధానంగా ప్రజాస్వామ్యవాదులు ఏనాటి నుంచో డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. అందుకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతూనే ఉన్నాయి. కానీ అవే పార్టీలు నేరచరితులను పెంచి పోషిస్తున్నాయేమోన నిపిస్తున్నది. మారిన కాలానుగుణ పరిస్థితుల్లో ఆర్థిక వనరులతోపాటు అంగబలం ఉంటే తప్ప విజయలక్ష్మిని దక్కించుకోలేమన్న ఆలోచనతో ఈ నేరచరితులకు స్థానం కల్పిస్తున్నారని చెప్పొచ్చు. రాబోయే సాధారణ ఎన్నికల్లో నేరచరితులు ఇప్పటి నుంచి సమయాత్తం అవ్ఞతున్నారు. అంగ,ఆర్థికబలాన్ని కూడగట్టుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో కూడా దేశ వ్యాప్తంగా శాసనసభకు,లోక్‌సభకు పోటీ చేసిన 2451 మంది అభ్యర్థుల్లో దాదాపు ఐదువందల ఇరవైఏడు మంది నేరచరితులు ఉన్నట్లు అలాగే బిజెపి నుంచి పోటీ చేసిన 1689మందిలో ఐదువందల ఇరవై మంది నేరారోపణలు ఎదుర్కొన్నవారిలో ఉన్నారు. బిఎస్పీలో 149 మంది, ఎస్పీ 180 మంది వీటన్నింటికి మంచి కాంగ్రెస్‌పార్టీలో అధికంగానే ఉన్నట్లు గణాంకాలే వెల్లడిస్తున్నాయి. అధికారం కోసం, ఆధిపత్యం కోసం రాజకీయ పార్టీలు నేరస్తులకు చోటు కల్పిస్తాయనే ఆరో పణలు కొట్టిపారేయలేం.

ఎన్నికల్లో రిగ్గింగ్‌, రౌడీయిజం, దౌర్జన్యం, తదితర దారుణాలు చేయాలంటే నేర స్వభావం ఉన్నవారు అవసరం అనే భావన పార్టీల్లో ఉండటం వల్లనే ఈ పరిస్థితి దాపురిస్తున్నది. నేరచరితుల ప్రవేశం రాజకీయాల్లో పెరిగిపోవడంతో రాజకీయాలు మరింత కలుషితం అవ్ఞతున్నాయి. సచ్ఛీలురకు చోటు లేకుండాపోతున్నది. భవిష్యత్తును తీర్చిదిద్ది దేశపురోబి µవృద్ధి వైపు నడిపించాల్సిన వారిపై ఈ భావం నెలకొ నడం సమాజానికి ఏమాత్రం క్షేమంకాదు. గతంలో ఎంతో పటిష్టంగా విద్యార్థి సంఘాలు ఉండేవి. వాటికే ఎన్నికలు జరిగేవి. అక్కడే రాజకీయ నాయకులు రూపుదిద్దుకునేవారు. ప్రజాసమస్యలతోపాటు చివరకు హోటళ్లలో తినుబండారాల రేట్లుపెరిగినా విద్యార్థి సంఘాలు ఉద్యమించి ఆందోళన కార్యక్రమం చేపట్టి తగ్గించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతెందుకు విశాఖ ఉక్కు ఉద్యమం కూడా విద్యార్థి నాయకులే నిర్వహించింది. విద్యార్థినాయకులుగా ఉండి అనేక ఉద్యమాల్లో పాల్గొని తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశం చేసి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకులు కూడా ఉన్నారు. అలాంటి విద్యార్థి సంఘాలను రద్దు చేయడంతో సమర్థత కలిగిన నాయకులు రాలేకపోతున్నారేమోననిపిస్తున్నది. విద్యార్థులకు, యువకులకు నాయకత్వ లక్షణాలు కొరవడుతున్నాయి. 1960 దశకంలో నేరచరితుల పక్కన కూర్చోడానికి రాజకీయ నాయకులు భయపడేవారు. ప్రజలు ఏమను కుంటారోనని జంకేవారు. నేరం చేసి జైలుశిక్ష అనుభ వించి తిరిగి బయటకు వస్తే సమాజం కూడా వ్యక్తిని వెలివేసినట్లు ప్రవర్తించేది.

అలాంటి వారు జనంలోకి రావడానికి కూడా వెనుకంజ వేసేవారు. కాలంతోపాటు పరిస్థితులకు అనుగుణంగా ఇవి కూడా మారిపోయాయి. నేరచరితులు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగుతున్నారు. అసలు నేరచరితులు అంటే ఎవరు? హత్యలు చేసిన వారా? శిక్షలు పడినవారా? ఆరోపణలకు గురైనవారా? కేసులు నమోదు అయినవారా? తదితర ప్రశ్నలు ఉదయి స్తాయి. 1951లో అమలులోకి వచ్చిన ప్రజాప్రాతినిధ్య చట్టంలోని ఎనిమిదో సెక్షన్‌ ప్రకారం నిర్దేశించిన నేరాలకు శిక్షపడినవారు కొంతకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయ డానికి అర్హులు. ఇందులో అనేక నేరాలున్నాయి. లంచ గొండితనం, ఎన్నికల అక్రమాలు, దొంగరవాణా, మాదక ద్రవ్యాల తయారీ, అమ్మకం వంటి నేరాల్లో శిక్షపడిన వారు ఆరేళ్లుపోటీ చేయడానికి అనర్హులు. నల్లబజార్ల విక్రయాలు, కల్తీలు, సతీసహగమనం, వరకట్నం తీసుకో వడం తదితర నేరాల్లో శిక్షపడితే శిక్షకాలం పూర్తిఅయిన మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. సెక్షన్‌ 8(ఎ) ప్రకారం అవినీతి కారణంగా ఉద్యోగం నుంచి తొలగించబడిన వారు ఐదేళ్లపాటు గత ఎన్నికల్లో ఖర్చు తెలుపని వారు మూడేళ్లపాటు పోటీ చేయడానికి వీలుండే దికాదు. ఈ చట్టానికి కొన్ని మినహాయింపులు కల్పించా రు. ఎవరైనా శాసనసభ్యుడిగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు శిక్షపడితే మూడు నెలల పాటు నిషేధం వర్తించదు.

ఆ సభ్యుడు పైకోర్టు అప్పీలు చేసుకుంటే అది పరిష్కారం అయ్యేవరకు నిషేధం వర్తించదు. దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా కొనసాగిన ఈ మినహాయింపు 1997లో శిక్షపడ్డాక అప్పీలు చేసుకున్నా నిషేధం వర్తించ దని ఎన్నికల కమిషన్‌ వివరణ ఇవ్వడంతో కొంతలో కొంత మార్పువచ్చింది. అయితే నేరస్తుల ఆరోపణలకు గురై విచారణ ఎదుర్కొంటున్న కొందరు నాయకుల అధికారుల కేసులు ప్రభుత్వమే ఉపసంహరించే సంప్రదా యం పెరిగిపోవడంతో లక్ష్యం నీరుగారిపోతున్నది. ఏపార్టీ అధికారంలోకి వచ్చినా తమ అనుచరులపై ఉన్న కేసు లను ఒక్కకలం పోటుతో ఉపసంహరించగలుగుతున్నా రు. ఇలాంటి చర్యలు నేరస్తుల్లో ధైర్యాన్ని పెంచుతున్నా యి. అందుకే మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు. ఒకపార్టీయే కాదు. అన్ని ప్రధాన పార్టీల్లో ఇదే ధోరణి పెరిగిపో తుండటం ఆందోళన కలిగించే అంశం. పార్టీల కు అతీతంగా నేరచరితులందరినీ ప్రజలు తిరస్కరించిన నాడే ఈ సమస్య పరిష్కారం అవ్ఞతుంది.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌