నేపాల్ ప్ర‌ధాని రాజీనామా

deuba
deuba

ఖాట్మండుః నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ డ్యూబా ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగ పరమైన మార్పులతో పాటు.. నూతన పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలను అనుసరించి డ్యూబా వైదొలిగారు. నూతన ప్రధానిగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) అధ్యక్షుడు కేపీ శర్మ ఓలి పదవిలోకి రానున్నారు. మరోవైపు ఓలిని ప్రధానిగా ఎన్నుకుంటూ బలప్రదర్శన చేసేందుకు వామపక్షాల కూటమి నేతలు ఇవాళ నేపాల్ అధ్యక్షుడు భండారీని కలుసుకోనున్నారు. గతేడాది పుష్ప కమల్ ద‌హాల్ పదవిలోనుంచి దిగిపోయిన అనంతరం ప్రస్తుత ప్రధాని డ్యూబా అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రిగా తన పదవీకాలం విజయవంతంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు.