నేనైతే…

crying
crying

నేనైతే..

ఆడదే ఆధారం సూత్రం ప్రకారం వందమంది మగాళ్లుంటే మఠం అవుతుంది. ఒక్క స్త్రీ వల్ల ఇల్లు ఏర్పడుతుంది. సృష్టి ప్రకారం స్త్రీ గృహిణి కాకముందు, తర్వాత పిల్లల్ని కనేంత వరకు ఆ వయసుకు అదే వయసు మగపిల్లల కన్నా బుద్ధికుశలతతో ఎక్కువగా ఉండేటట్లు ఉంచబడింది. నూటికి నూరు మంది స్త్రీలు, తన కుశాగ్రబుద్ధితో, తన తల్లిదండ్రులను, దగ్గరివారిని, ఇరుగుపొరుగు వారిని పరిశీలించి వారి లోటుపాట్లను చెప్పగలరు. అలా ఉండకూడదని అనుకుంటారు.

జీవితం క్షణికం కాదని, కాలం చేసేంత వరకు సాగవలసిందని దాన్ని ఎలా సాగించగలమో ‘నేనైతే భావనతో జీవిత నిర్దేశకత ఏదో రూపంలో స్త్రీలో భావించబడటం వలన, నూటికి నూరు మంది నడిచిన దారిలోనే వారు మలుచుకుంటారు. పోతుంటారు. అవగాహన రాహిత్యం, క్షణిక చాపలం, లోకపరిశీలన లేకపోవడం, స్వంత బుద్ధి, వ్యక్తిత్వం లేకపోవడం వగైరా అవలక్షణాలతో ఒకరిద్దరు ఎగిరిపోతే ఎంత బావ్ఞంటుందోననే ఆరాటంతో తమ సొంత ఆలోచనలతో వెళ్లిపోతుంటారు. దాంతో కన్నోళ్లు ఒక ఏడుపు ఏడ్చి ఊరుకొంటారు. సంఘానికి అది పట్టని విషయం. కాకపోతే కాసేపు చెప్పుకుంటారు. అదే ప్రముఖుల బిడ్డలైతే ప్రచార మాధ్యమాలలో మోత పుట్టిస్తారు. పిట్టకథలు, లేకిమూకల రోల్‌ని ప్రధాన విషయంగా చేసుకుటారు. ఈ అవలక్షణ బాధితులు సలక్షణంగా స్ధిరపడటం ఎంత శాతం.

విఫలమై వీధుల పాలయిన కొంతమంది తప్పు తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చిన కొన్ని కేసులు వగైరాల లెక్కలు ప్రసార మాధ్యమాలు పట్టించుకొనవ్ఞ. ఒక సంవత్సర కాలంలో ప్రచార మాధ్యమాలు అప్పట్లో కలిగినవెన్నో అవి లెక్కించుకుని వాటి తీరుతెన్నులు, సంవత్సరం ఆగి పట్టిక ఏర్పరిచి ప్రజల కందిస్తే నిజానిజాలు ఒక క్రమపద్ధతికొస్తాయి. ఈ బలహీనతకు కారణాలు, పరిస్థితులనూ, గణనలు, నేపథ్యాలు ఇవన్నీ గణన చేయవలసి ఉంది. క్షణికావేశం, అశ్లీల విషయం మొదలగునవి, టివిలు, సినిమాలు, ప్రచురణలు వగైరాలన్నీ కారణంగా చెప్పడం ఒక వంతు తప్ప నూరు అవవ్ఞ. తనెలా పుట్టానో తనకు తెలీదనుకోడం ఉండదు. నూటికి నూరు మందికదొక సహజ లక్షణం కాని జీవితం కాదు. జీవిత గమన నిర్దేశం చిన్నప్పటి నుండీ ఇంటిని ఇరుగుపొరుగు బంధువ్ఞలను చూచి ‘నేనైతే ఇలా కాదు అలా ఇలా భావాలతో జీవిత నిర్దేశకత అంటుంది. అలాంటి పరిశీలనాత్మక బుద్ధి, జీవన నిర్దేశ లక్షణం సరిగా లేప్పుడు బలహీనత కల్గును.