నేనే చంపేసుకోవాలనిపిస్తోందంటూ ట్వీట్

RGV-1
RGV

అందాల నటి శ్రీదేవి మృతిని జీర్ణించుకోలేకపోతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నన్ను నేనే చంపేసుకోవాలనిపిస్తోందంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. శ్రీదేవి మృతి చెందింది అంటే తాను నమ్మలేకపోతున్నానని అన్న వర్మ.. తన జ్ఞాపకాల్లో శ్రీదేవి ఎప్పటికీ జీవించే ఉంటుందని పేర్కొన్నారు. అయితే శ్రీదేవి మృతిపై ఏర్పడిన మిస్టరీ కారణంగా ఇప్పుడు చర్చంతా.. ఆమె ఎలా చనిపోయింది అనే అంశం చుట్టు తిరుగుతోంది. దీంతో వర్మ ఇది సహించలేకపోయారు.

శ్రీదేవి ఉన్నంతకాలం ఆమె అందం గురించి చర్చించిన వారంతా.. ఇప్పుడు ఆమె చనిపోయిన తీరుపై స్పందిస్తున్న తీరు తనని ఎంతో బాధకి గురి చేస్తోందని వర్మ పేర్కొన్నారు. ‘‘శ్రీదేవికి సంబంధించి, అందరూ ఆమె శారీరక అందం, తన కళ్లు, పెదాలు గురించి మాట్లాడి.. ఇప్పుడు ఆమె మృతదేహం, తన రక్తంలో మద్యం, ఊపిరితిత్తుల్లో నీరు, తన కడుపులో ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నారు.. దేవుడా’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ.. ‘‘ఒక మనిషి జీవితం ఇంత విషాదకరంగా, ఇంత భయంకరంగా ఎలా ముగుస్తుంది. తనని ఇంత కఠినాత్మకంగా విచ్ఛిన్నం చేయడం నన్ను ఎంతో భయానికి గురి చేస్తోందని పేర్కొన్నాడు.