నేనేమీ రోబోను కాదు..నాకు కూడా రెస్ట్ కావాలిః కోహ్లీ

KOHLI
KOHLI

కోల్‌కతా: భార‌త్‌-శ్రీలంకల మధ్య కోల్‌క‌తా వేదిక‌గా రేపటి నుంచి తొలి టెస్ట్ మొదలవనున్న నేపథ్యంలో టీమీండియా కెప్టెన్ కోహ్లి మీడియాతో ముచ్చటించాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నాకు కూడా రెస్ట్ కావాలి.. నేనేమీ రోబోను కాదు.. నా చ‌ర్మాన్ని కోస్తే ర‌క్తమే వ‌స్తుంది. నాకు అవ‌స‌ర‌మైన‌ప్పుడు విశ్రాంతి అడుగుతా.. ఓ ప్లేయర్ ఎంత పని భారాన్ని మోస్తున్నాడన్నదానిపై రెస్ట్ ఇవ్వడం ఆధారపడి ఉంటుంది. అది ఒక్కో ప్లేయర్‌కు ఒక్కోలా ఉంటుంది అని అన్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఎందుకు అన్న ప్రశ్నపై విరాట్ ఇలా స్పందించాడు. తన ఫిట్‌నెస్‌ను మళ్లీ పెంచుకునేందుకు పాండ్యానే రెస్ట్ కావాలని కోరాడని కోహ్లి చెప్పాడు. చాలా క్రికెట్ ఆడుతున్నాం. అలాంటప్పుడు మన ప్రిపరేషన్‌లో ఎంత నాణ్యత ఉందో చూసుకోవాలి, ఎన్ని మ్యాచ్‌లు ఆడామన్నది కాదు అని అతనన్నాడు. ఏడాదికి ఒక్కో ప్లేయర్ 40 మ్యాచ్‌ల వరకు ఆడతాడని, పని భారం ఎక్కువగా ఉన్న ప్లేయర్స్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని కోహ్లీ తెలిపారు.