నేను తెలంగాణ ప్రజల ఏజెంట్‌ని

kcr
kcr

– ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలే
– మహారాZష ప్రజలే తెలంగాణలో కలపాలని కోరారు
– ప్రజా ఆశీర్వాద సభల్లో ఆపధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వ్యాఖ్యలు
నల్లగొండ: కెసిఆర్‌ యుపిఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ ఏజెంట్‌ అని మోదీ అంటున్నారు. ఏఐసిసి అధ్యక్షులు రాహుల్‌గాంధీ ఏమో మోడీ ఏజెంట్‌ని అంటారు. నేనెవరి ఏజెంటును కాదని తెలంగాణ ప్రజలకే ఏజెంట్‌ని అని తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్‌, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, నల్లగొండ ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదని ప్రజలు గెలవడం ద్వారా నిజమైన ప్రజా స్వామ్యం పరిడవిల్లుతుందని వ్యాఖ్యానించారు. అందుకోసం కులాల ప్రాతిపదికన ప్రలోభాలకు ఓట్లు వేయోదన్నారు. ఏడు దశాబ్దాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌, బిజెపి ప్రభుత్వాల మూలంగా పేదల ఆకలి భాదలు తీరడం లేదన్నారు. రైతు ఆత్మహత్యలు ఆగడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 75వేల టిఎంసిల నీరు అందుబాటులో ఉంటే 30వేల టిఎంసిలు మాత్రమే వినియోగిస్తున్నామని ఇది పాలకుల నిర్లక్ష్యతీరుకు నిదర్శనమన్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరగాలని కెసిఆర్‌ హితవ్‌ పలికారు. తెలంగాణలో మాదిరిగా దేశంలో మరేఇతర రాZషాల్లో ఇంతపెద్ద మొత్తంలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకావడంలేదన్నారు. బిజెపి పాలిత రాZషాల్లో కూడా 24గంటల విద్యుత్‌ లేదని చెప్పారు. మహారాZషలోని నాందేడు జిల్లా ధర్మాబాద్‌ తాలూకాలోని 44గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని తీర్మానం చేశారని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి ఇదో నిదర్శనమన్నారు. గడిచిన నాలుగున్న సంవత్సరాల్లో రాZష వ్యాప్త పర్యటనలు తాను చేయలేక పోయానని తెలంగాణ అభివృద్ది కోసమే ప్రణాళికలు తయారు చేశామని ఈ సారి ప్రతి ప్రాంతానికి వస్తానన్నారు. సోమవారం రోజు తన సభలకు దాదాపు మూడున్న లక్షలకు పై చిలుకు జనం వచ్చారని కెసిఆర్‌ తెలిపారు. తాము వందకు పై సీట్లు గెలవబోతున్నామని ప్రకటించారు. నల్లగొండ సభలో మాట్లాడుతూ తాను నల్లగొండ నుంచి పోటీ చేయాలని భావించానని ఈ లోగ భూపాల్‌రెడ్డి రావడంతో తన ఆలోచనను విరమించుకోని గజ్వెల్‌కే పరిమితమయ్యానని చెప్పారు. నల్లగొండలో టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని కెసిఆర్‌ ప్రకటించారు. ఈ ఆశీర్వాద సభలో నల్లగొండ పార్లమెంట్‌ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్‌, మాజీ మంత్రి ఉమామాదవరెడ్డి, బండా నర్సిరెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.