నేతాజీ(ములాయం) ధోరణి నచ్చక పార్టీ నుంచి వైదొలగుతున్నా : ఎమ్మెల్సీ అశోక్‌

Ashok SP
Ashok Bajpay

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి మరో షాక్‌. పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అశోక్‌ బాజ్‌పా§్‌ు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పార్టీలో రాజీనామాల నంబర్‌ నాలుగుకు చేరింది. అశోక్‌కు పూర్వం రాజీనామా ముగ్గురు ఎమ్మెల్సీలు భాజపాలో చేరారు. అదే మార్గంలో అశోక్‌ వెళ్లే అవకాశం ఉందని సమాచారం. శాసనమండలి ఛైర్మన్‌ రమేశ్‌ యాదవ్‌కు తన రాజీనామా సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ స్థాపకుడు నేతాజీ (ములాయం) పట్ల వ్వవహరిస్తున్న ధోరణి నచ్చక రాజీనామా చేస్తున్నాని తెలిపారు. ఎస్పీ నుంచి రాజీనామా చేసిన మరో మహిళా ఎమ్మెల్సీ ఇదే విషయాన్ని ప్రస్ఫుటంగా తెలిపారు. ములాయం సముచిత స్థానం ఇవ్వక పోవడం వలనే
పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు. ఆ పార్టీలో ఇమడలేక భాజపాలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.