నేతల వ్యక్తిగత ఆరోపణలతో టిడిపికి తలనొప్పి

TDP
TDP

అమరావతి: ఎన్నికలకు ముందే నేతల వ్యక్తిగత ప్రకటనలతో టిడిపికి తలనొప్పి మొదలైంది. నిన్నంతా టిజి వెంకటేశ్‌ వ్యాఖ్యలతో దద్దరిల్లిని మీడియా ఇవాళ జలీల్‌ ఖాన్‌ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. విజయవాడ పశ్చిమ సీటు తన కుమార్తెకు ఇచ్చారంటూ జలీల్‌ఖాన్‌ ప్రకటించడంపై స్థానిక నేతలు ఆగ్రహానికి గురవుతున్నారు. ఎవరికి వారే సీట్లు ప్రకటించుకోవడం ఏంటంటూ, ఇక అధిష్టానం ఉన్నది దేనికంటూ జలీల్‌ఖాన్‌పై చంద్రబాబుకు నాగుల్‌మీరా ఫిర్యాదు చేశారు.