నేడు హైదరాబాద్‌కు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల రాక

హైదరాబాద్‌ : భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆరు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు శనివారం హైదరాబాద్‌కు వస్తున్నాయి. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందాలు సహాయక చర్యలు చేపట్టనున్నాయి. ఒక్కో టీమ్‌లో 40 మంది సిబ్బంది ఉంటారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తక్షణం వరద బాధితులను ఆదుకునేందుకు ఆర్మీ సహకారం అందించాలని కల్నల్‌ జిబిఎంయు రావుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.