నేడు విశాఖలో పర్యటన

babufff
AP CM Chandrababu Naidu

నేడు విశాఖలో పర్యటన

విశాఖ: సిఎం చంద్రబాబునాయుడు ఇవాళ మధ్యాహ్నం విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖకుచేరుకుని ఎయులో సైబర్‌ సెక్యూకురిటీ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం వర్సిటీ విసిల సమావేశంలో ప్రసంగిస్తారు. తదుపరి అంతరిక్ష వారోత్సవాల ముగింపు సభలో పాల్గొంటారు. ఇస్రో సహాయంతో చేపట్టనున్న ప్రాజెక్టులపై ఇస్రో చైర్మన్‌ కిరణ్‌కుమార్‌, షార్‌ డైరెక్టర్‌ కున్హీ కృష్ణన్‌తో సిఎం చర్చిస్తారు. సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్‌లో విశాఖ అభివృద్ధిపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అన్ని కార్యక్రమాలు ముగించి సాయంత్రం 5.30 గంటలకు సిఎం విజయవాడకు బయలుదేరుతారు.