నేడు రియల్‌మీ నార్జో స్మార్ట్‌ఫోన్లు రిలీజ్

నేడు రియల్‌మీ నార్జో స్మార్ట్‌ఫోన్లు రిలీజ్
realme-to-launch-realme-narzo-10-and-narzo-10a-today

రియల్‌మీ ఫోన్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు రియల్‌మీ నుంచి కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కాబోతున్నాయి. మార్చిలోనే రియల్‌మీ నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా లాక్‌డైన్‌ కారణంగా లాంఛింగ్ రెండు సార్లు వాయిదా పడింది. కాగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షల్లో కొన్ని సడలింపులు ఉండటంతో మే 11న మధ్యాహ్నం 12.30 గంటలకు రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించింది రియల్‌మీ. రియల్‌మీ నుంచి ఇప్పటికే ప్రో, ఎక్స్, యూ, సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ సిరీస్ ఫోన్లన్నీ ఉన్నాయి. వాటితో పాటు నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లను కొత్తగా ప్రకటించింది రియల్‌మీ. రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ మొబైల్స్ షావోమీకి చెందిన పోకో ఎఫ్1, పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్లకు పోటీ ఇస్తాయని భావిస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/