నేడు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణి

bathukamma sarees
bathukamma sarees

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణి మొదలైంది. ఆయా నియోజకర్గాల్లో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా చీరల పంపిణి కార్యక్రమం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూర్ లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మెదక్ మండలం రాఇన్ పల్లిలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, వేములవాడలో ఎమ్మెల్యే రమేష్ బాబు, జనగామ పట్టణంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, చేవెళ్లలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, నగరంలోని నాచారం డివిజన్ లో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, వనపర్తి పట్టణంలో ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి, ఆదిలాబాద్ రూరల్ మండలం అంకొలి గ్రామంలో ఎమ్మెల్యే జోగు రామన్న, నిర్మల్ మండలం ఎల్లపెల్లిలో ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మహబూబ్ నగర్ గ్రామీణ మండలం పరిధిలో జమిస్తాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ బతుకమ్మ చీరలను ఆడపడుచులకు అందజేశారు.