నేడు మోడ‌ల్ స్కూళ్ల‌లో ప్ర‌వేశ ప‌రీక్ష‌

Model School
Model School

కృష్ణాః గంపలగూడెం ఏపీ మోడల్‌ స్కూల్లో ప్రవేశానికి ఆసక్తి చూపిస్తున్న బాల బాలికలకు 7 నుంచి 10వ తరగతి వరకు పెంచిన సీట్లకు సంబంధించి ఈనెల 9వ తేదీ ఉదయం 11 గంటలకు ఎంట్రన్స్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ కొప్పుల మేరీప్రతిష్ఠ ఆదివారం తెలిపారు. 20 సీట్లు చొప్పున పెంచామని, భర్తీచేసేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.