సానియా, హింగిస జోడీకి గ్రాండ్‌ స్లామ్‌

 

 

SANIA

సానియా, హింగిస జోడీకి గ్రాండ్‌ స్లామ్‌
మెల్‌బోర్న్‌: సానియా, హింగిస్‌ జోడీ ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మెల్‌బోర్న్‌లో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో వరుస సెట్లలో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన హ్లవాకోవా, హర్డెక్‌ జోడీపై విజయం సాధించి మహిళల డబుల్స్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయారు. తొలిసెట్‌ హోరాహోరీగా సాగింది. టైబ్రేకర్‌లో 7-6, (7-1) స్కోరుతో సానియాజోడీ గెలుపొందింది. రెండోసెట్‌ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఈసెట్‌లో 6-3 తేడాతో గెలిచి 2016 డబుల్స్‌ విజేతగా సానియా, హింగీస్‌జోడీ నిలిచింది.