నేడు మంత్రి ఈటల బెంగుళూరు పర్యటన

Eetala Rajendar
Eetala Rajendar

హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నేడు బెంగుళూరు వెళ్లనున్నారు. జీఎస్టీ గ్రూప్‌ ఆఫ్‌
మినిస్టర్స్‌్‌ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి ఈటల బెంగుళూరు వెళ్తున్నారు. జీఎస్టీ సజావుగా అమలు
జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో
ఈ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. జీఎస్టీ అమలులో ఎదురౌతున్న సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం
చర్చించి కేంద్రానికి నివేదించనుంది.