నేడు బాధ్యతలు చేపట్టనున్న సర్పంచులు

gram panchayat
gram panchayat

హైదరాబాద్‌: తెలంగాణ గ్రామ పంచాయతీల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఈరోజు పాలన పగ్గాలను చేపట్టనున్నారు. రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో 12,680 పంచాయతీలకు పాలకవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. వీరితో ఎన్నికల అధికారులు నేడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం సర్పంచులు, వార్డు సభ్యులు తమ పాలన బాధ్యతలను స్వీకరించనున్నారు. రాష్ట్రంలో 12,751 పంచాయతీలు ఉండగా ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో 12,680 పంచాయతీలకు, 1,13,152 మంది వార్డులకు ఎన్నిక పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.