నేడు నారావారిప‌ల్లెలో సీఎం నారా చంద్రబాబు

AP CM Chandrababu Naudu
AP CM Chandrababu Naudu

సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నాం తిరుపతికి వెళ్లనునానరు. సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకోవడాన్ని చంద్రబాబు కుటుంబం ఆనవాయితీ. సాయంత్రం 5గంటలకు చంద్రాబాబు నారావారిపల్లెలో స్వగృహానికి చేరుకుంటారు. నారావారిపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తన తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూరనాయుడు సమాధుల వద్ద పూజలు నిర్వహించనున్నారు. కులదైవమైన నాగాలమ్మ ఆలయం వద్ద చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఓ సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. 15వ తేదీ మధ్యాహ్నాం వరకు సీఎం సొంతూర్లోనే గడుపుతారు. సంక్రాంతి అనంతరం 16న సీఎం చంద్రబాబు అమరావతికి రానున్నారు.