నేడు దేశమంతా అన్ని హాస్పటల్స్ లలో మాక్ డ్రిల్

Mock drills across India today on hospitals’ COVID readiness

కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్న నేపథ్యంలో నేడు దేశమంతా అన్ని హాస్పటల్స్ లలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. కరోనా నాలుగో వేవ్ కి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్న ప్రభుత్వం నేడు దేశమంతా మాక్ డ్రిల్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. ఈ క్రమంలో నేడు దేశ వ్యాప్తంగా కరోనా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.

కర్నాటకలో విద్యాసంస్థలు, థియేటర్లలో మాస్క్‌లను తప్పనిసరి చేశారు. ప్రస్తుతం దేశమంతా కరోనాపై హైఅలర్ట్‌ కొనసాగుతోంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సభ్యులతో సమీక్ష నిర్వహించారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ. చైనా లాగా భారత్‌లో పరిస్థితులు లేవని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఎంఏ సభ్యులు కేంద్రమంత్రికి తెలిపారు. దేశం నలుమూలల నుంచి 100 మంది వైద్యనిపుణలు ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్‌తో హాజరయ్యారు. కరోనా విజృంభిస్తే ఎలా తట్టుకోవాలన్న విషయంపై మంగళవారం దేశమంతా ఆస్పత్రుల్లో మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ లభ్యత, బెడ్స్‌పై మాక్‌డ్రిల్‌లో సమీక్షిస్తారు. ఆక్సిజన్‌ కొరత లేకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచించింది.

దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ వస్తే దానిని ఎలా ఎదుర్కోవాలో ప్రాక్టికల్ గా చేస్తారు. కరోనా పేషెంట్లను ఆసుపత్రులకు తీసుకు రావడం, వారికి మందులు ఇవ్వడం, వారికి ఆక్సిజన్ ఇవ్వడం, ఐసోలేషన్, క్వారంటైన్, కరోనా జాగ్రత్తలు పాటించటం వంటి కరోనా కు సంబంధించిన చేయాల్సినవన్నీ ఒకసారి ఈ మాక్ డ్రిల్ లో చేస్తారు.