నేడు తెరుచుకోనున్న క్షేత్రం

SABARIMALA
SABARIMALA

నేడు తెరుచుకోనున్న క్షేత్రం

శబరిమలలో టెన్షన్‌..టెన్షన్‌

తిరువనంతపురం: సుప్రీంకోర్టు తీర్పుపై కేరళ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులనుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో భక్తులను అనుమతించే విషయమై ఇప్పటికీ ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క భక్తులు బస్సుల్లో తరలివస్తున్నారన్న అనుమానాలతో అయ్యప్ప భక్తులసంఘాలు ప్రతి రవాణా బస్సులను అడ్డగించి శబరిమలవైపు వెళ్లే అందరినీ దించివేస్తు న్నారు. సోమవారంనుంచి అయ్యప్ప భక్తుల నిరసన మరింత తీవ్రతరం అయింది. 10నుంచి 50 ఏళ్లమధ్య వయసు ఉన్న మహిళలను అనుమ తిస్తే ఆత్మాహుతి దళాలు దాడిచేస్తాయని ఇప్పటికే కేరళ శివసేన హెచ్చ రించింది. అలాగే మళయాళనటుడు కొల్లం తులసి కూడా సుప్రీం తీర్పుప్రకారం వచ్చిన వివిధ వయసుల మహిళలు అయ్యప్పసన్నిధానం వరకూ కూడా చేరుకోలేరనిచెపుతూ దూషణభాషలో ప్రసంగించడం కూడా ఉద్రిక్తతలకు దారితీసింది.

SABARIMALA1
SABARIMALA1

తీవ్ర ఉద్రిక్తతల నడుమ అయ్యప మందిరం బుధవారం తులమ్‌ పూజకోసం తెరుస్తున్నారు. ఎలాంటి అనుచిత సంఘటనలు చోటుచేసుకున్న వెంటనే కట్టడిచేసేందుకు పోలీసులు అప్ర మత్తంగా ఉన్నారు. మహిళా భక్తులకు రక్షణకల్పించి తీర్పును అమలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఒకవేళ వారు వస్తే వారికి రక్షణ ఇస్తామని, సుప్రీం కోర్టు ఉత్తర్వులనే అమలుచేస్తామని పోలీస్‌ ఛీఫ్‌ లోక్‌నాధ్‌ బెహరా వెల్లడించారు.

SABARIMALA11
SABARIMALA

 

మహిళా పోలీసులు కూడా పంపా పరిసరాల్లో ఎక్కువ సంఖ్యలో నియమితులయ్యారు. మహిళా అధికారులు కూడా ముందే అక్కడ బందోబస్తుకు నియమించాలని ప్రభుత్వం సూచించింది.