నేడు ఢిల్లీ కి జగన్.. ప్రధాని మోడీతో భేటీ

సీఎం జగన్ నేడు ఢిల్లీ కి వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకొని అక్కడి నుండి విమానంలో ఢిల్లీ కి వెళ్తారు. రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. జనపథ్ 1లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు.
బుధవారం మధ్యాహ్నం 12 గంటల 30నిమిషాలకి ప్రధాని మోడీ తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాలసిన నిధులు, పోలవరం, విభజన హామీల గురించి ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడు శీతాకాలం కాబట్టి పోలవరం నిధులు విడుదల చేస్తే వర్షాకాలం వచ్చే నాటికి చాలా వరకు పనులు పూర్తి చేయవచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.