నేడు టెట్‌పై తుది నిర్ణయం: మంత్ర్రి గంటా

AP Minister Ganta
AP Minister Ganta

రాజమండ్రి: ఉపాధ్యాయం అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణ తేదీపై తుది నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పలు శిక్షణ సంస్థలు విద్యర్థులను రెచ్చగొట్టి టెట్‌ వాయిదాకు ఆందోళనలు చేయిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. టెట్‌ నిర్వహించాలా లేదా అని ఆలోచిస్తున్నామని, దీనిపై తుది నిర్ణయం ఈ రోజు వెల్లడిస్తామన్నారు. ఐతే షెడ్యూల్‌ ప్రకారం డిఎస్సీ నిర్వహించి తీరుతామని మంత్రి అన్నారు.