నేడు కెసిఆర్‌ అధ్యక్షతన మంత్రి వర్గ భేటి

పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న ప్రభుత్వం

kcr
kcr

హైదరాబాద్‌: నేడు సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కరోనా వైరస్‌ పరిస్థితి, లాక్‌డౌన్‌ అమలు, ఆర్ధిక పరంగా తీసుకోవాల్సిన విషయాలను గురించి చర్చించనున్నారు. కేంద్రం ఇచ్చిన సడలింపులను రాష్ట్రంలో అమలు చేసే విషయంపైన, మద్యం అనుమతులపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విషయంలో కూడా ఓ నిర్ణయానికి రానున్నారు. కరోనా కట్టడి నివారణ చర్యలు, సమగ్ర వ్యవసాయ విధానం, నీటిపారుదల ప్రాజెక్టులు వంటి విషయాలపై కూడా చర్చించనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/