నేడు కూడా విశ్రాంతే?

PAWAN
PAWAN

నేడు కూడా విశ్రాంతే?

అరకులో రెండో రోజూ అతిథి గృహానికే పరిమితమైన పవన్‌
మంగళవారం రోడ్డుషో జరిగే అవకాశాలు?

అరకులోయ, (విశాఖపట్నం) : అరకులోయ పర్యటనకు విచ్చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రెండో రోజు ఆదివారం కూడా అతిథి గృహానికే పరిమితమయ్యారు. మన్యం పర్యటనలో బాగంగా ఇక్కడకు శనివారం సాయంత్రం విచ్చేసిన పవన్‌ కల్యాణ్‌ నేరుగా అతిథి గృహంకు చేరుకుని బస చేసిన సంగతి విదితమే. రెండో రోజు పర్యటన జరుగుతుందని బావించిన పార్టీ కార్యకర్తలు,అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ రోజంతా విశ్రాంతి తీసుకోవడంతో తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు,పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అతిది గృహానికి తరలి వెళ్ళారు. అయితే అతిది గృహం ముఖ ద్వారం వద్ద గేటు మూసి వేయడంతో అసంతృప్తి చెందిన అభిమానులు తమ హీరోను, కాబోయే సిఎంను ఎట్టి పరిస్థితుల్లోనూ చూసి తీరుతామని పట్టుబ ట్టడంతో విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది పవన్‌కు తెలియ జేసారు. దీంతో స్పందించిన పవన్‌ కళ్యాణ్‌ సాయంత్రం ఏడు గంటల సమయంలో అభిమానుల వద్దకు వెళ్లి అభివాదం చేసారు. దీంతో ఆనందం వ్యక్తంచేసిన అభిమా నులు తమ కాబోయే సిఎం పవన్‌ కళ్యాణేనని, తమ హీరోకు జేజేలు అని అభిమానులు పెద్ద ఎత్తున నినదించారు. అంతకు ముందు ఉదయం ఏడు గంటల సమయంలో అతిది గృహం నుండి కొద్ది సేపు భయటకు వచ్చిన పవన్‌అభిమాను లతో ఫోటోలు దిగారు. కాగా సోమవారం కూడా పవన్‌ కళ్యాణ్‌ అతిది గృహానికే పరిమితమయే అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు సమాచారం. అయితే మంగళవారం అరకులోయలో రోడ్డు షో నిర్వహించి అక్కడినుండి పాడేరు పయనమవుతా రన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పవన్‌ కల్యాణ్‌ మూడు రోజులు పాటు అరకులోయలో బస చేస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు సుదూర ప్రాంతం నుండి ఇక్కడకు చేరుకుంటు న్నారు. దీంతో పవన్‌ బస చేస్తున్న ప్రయివేటు అతిది గహం సందడిగామారింది. పవన్‌ అరకు లోయ పర్యటన వివరాలు తెలియకపోవడంతో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు.