నేడు కీలక ప్రకటన చేయనున్న ట్రంప్‌

Trump
Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంపు ప్రభుత్వ షట్‌డౌన్‌ పై ఈరోజు కీలక ప్రకటన చేయనున్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు. ఈరోజు సాయంత్రం 3 గంటలకు అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌, మెక్సికో సరిహద్దుల్లో గోడనిర్మాణంపై ఒక కీలక ప్రకటన వెలువడుతుంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 29 రోజుల నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోవడంతో దాదాపు 8లక్షల మంది ఉద్యోగులు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు.