నేడు కడపలో పర్యటించనున్న చంద్రబాబు

Chandrababunaidu
Chandrababunaidu

కడప: ఏపి సిఎం ఈరోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కడపలో జరిగే డ్వాక్రా సదస్సులో పాల్గొననున్నారు. ఇందుకోసం కడప మున్సిపల్‌ మైదానంలో సభా వేదికతో పాటు భారీ ప్రాంగణాన్ని నిర్మించారు. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా నుంచి సుమారు 40 వేల మంది మహిళలు సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక్కడి సభ అనంతరం విశాఖకు బయలుదేరి వెళ్తారు. కడప, గుంటూరు, విశాఖలో డ్వాక్రా సదస్సులే నిర్వహిస్తుండగా.. ఒక్కోచోట ఒక్కో పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సదస్సులో సుమారు రూ.13 వేల కోట్లకు సంబంధించిన వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం.