నేడు ఐర్లాండ్‌తో భారత్ ఢీ
కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
ఢాకా : బంగ్లాదేశ్‌లో అండర్-19 ప్రపంచ కప్ రెండవ రోజైన గురువారం ఐర్లాండ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.కాగా మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడతున్నాయి.పిబ్రవరి 14 వరకు ఈ టర్నో జరుగనుంది.టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి దిగుతున్న మాజీ చాంపియన్ భారత్ గ్రూపు డి లో ఐర్లాండ్,నేపాల్, న్యూజిలాండ్‌లను ఎదుర్కొంటుంది.గ్రూపు సిలో ఇంగ్లండ్,ఫిజి,వెస్టిండీస్, జింబాబ్వే,గ్రూపు బిలో అప్ఘనిస్థాన్,కెనెడా,పాకిస్థాన్ శ్రీలంక గ్రూప్ ఎలో ఆతిథ్య బంగ్లాదేశ్,నమీబియా, డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికా,స్కాట్లాండ్ ఉన్నాయి.భారత్ వార్మప్ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన ఈ టోర్నీలో టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి దిగుతుంది.కాగా రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న యువ భారత జట్టుకు ఇషాన్ కిషన్ నాయకత్వం వహిస్తున్నాడు.అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్ నేడు తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది.కాగా భారత్ 2000, 2008, అండర్-19 ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.