నేడు ఐటీ సీఈవోలతో రజత్‌కుమార్‌ సమావేశం

RAJATH KUMAR
RAJATH KUMAR

హైదరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఐటీ కారిడార్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. ఐటీ కంపెనీల సీఈవోలతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ ఈరోజు  సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సమావేశం కానున్నారు. ఐటీ కారిడార్‌లో లక్ష మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. పోలింగ్‌ శుక్రవారం వస్తున్నందున వీకెండ్‌ సెలవులు మంజూరు చేయొద్దని, ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని భావిస్తున్నారు. ఈమేరకు సైబరాబాద్‌ పోలీస్‌, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్సీఎస్సీ) ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.