నేడు ఆర్టీసి సమ్మెపై కీలక నిర్ణయం

TSRTC
TSRTC

హైదరాబాద్‌: ఆర్టీసి సమ్మెపై ప్రతిష్టంభన నెలకొంది. శనివారం అర్ధరాత్రి వరకు మంత్రివర్గ సబ్‌కమిటీతో ఆర్టీసి కార్మిక సంఘాలు చర్చలు జరిపింది. కార్మిక సంఘాల ప్రతిపాదనలను సీఎం కెసిఆర్‌ దృష్టికి మంత్రులు తీసుకెళ్లారు. మరోమారు మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపనుంది. ఆర్టీసిపై పన్నులు ఎత్తివేస్తే పన్నుల నుండి గట్టెక్కుతామని టిఎంయు నేతలు పేర్కొంటున్నారు. కానీ పన్నుల రద్దుపై మంత్రులు స్పందించలేదు. ఆదివారం ప్రభుత్వం వచ్చే స్పష్టత ప్రకారం సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.