నేటి నుండే వనదేవతల జనజాతర

MEDERAM-1
MEDERAM-

నేటి నుండే వనదేవతల జనజాతర

వ్రరంగల్‌ / జఫర్‌గడ్‌: ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరగా.. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన తెలంగాణలోని మేడారం మహాజాతర నేటి నుండి ప్రారంభం కాబోతున్నది. విగ్రహాలు లేని శ్రీసమ్మక్క- సారలమ్మ జాతర పూర్తిగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలతో ప్రతిబింబిస్తుంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ఆరంభమై నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ఈ మహాజాతరకు నేడు అంకురార్పణ జరగనుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా 31న బుధవారం సాయంత్రం సాలరమ్మ గద్దెపైకి చేరుకుంటుంది.