నేటి నుండి ఏపిలో ఎస్జీటీ పరీక్షలు

అమరావతి: ఏపీలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్పెషల్ స్కూల్ టీచర్లకు సంబంధించిన డీఎస్సీ2018 పరీక్షలు శుక్రవారం నుంచి ఆన్లైన్లో రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. ఎస్జీటీ 8 రోజులపాటు, స్పెషల్ స్కూల్ టీచర్ పరీక్షలు రెండు రోజులపాటు జరగనున్నాయి. ఇవి శుక్రవారం నుంచి ప్రారంభమై ఈ నెల 31 వరకు జరుగుతాయి. 123 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 3,45,114 మంది ఎస్జీటీ, 866 మంది స్పెషల్ టీచర్ల పరీక్షలను రాయబోతున్నారు.