నేటి నుంచి హాకీ ట్రైనింగ్‌ క్యాంప్‌

sp3

నేటి నుంచి హాకీ ట్రైనింగ్‌ క్యాంప్‌

బెంగళూరు: రియో ఒలింపిక్స్‌ తరువాత కొంత కాలం విశ్రాంతి తీసుకున్న భారత్‌ హాకీ క్రీడాకారులకు ట్రైనింగ్‌ క్యాంప్‌ మళ్లీ నేటి నుంచిప్రారంభం కానుంది.కాగా రియోలో భారత్‌ ఎనిమిదవ స్థానంలో నిలిచింది.అక్కడ నుంచి తిరిగి వచ్చిన తరువాత క్రీడాకారులకు ఆట విడుపు లభించింది.ఇప్పుడు వారి తోపాటు,ప్రాబబుల్స్‌ జాబితాలో ఉన్న మిగతా ఆటగాళ్లకు కూడా నాలుగు వారాల క్యాంపు మొదలు కానుంది.కెప్టెన్‌ శ్రీజేష్‌ సహా మొత్తం 26 మంది ప్రాబబుల్స్‌ ఈ శిబిరంలో పాల్గొంటారు. మలేసి యాలో వచ్చే నెల మొదలుకానున్న ఆసియా చాంపియన్స్‌ ్ట్టట్రోఫీలో భారత్‌ తలపడుతుంది.కాగా ఈ టోర్నీకి తుది జట్టును ఎంపిక చేయడానికి వీలుగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.ఫిట్నెస్‌,నైపుణ్యం, వ్యూహాలపై ఆటగాళ్లు దృష్టి కేంద్రీకరిస్తారు. చాంపియన్స్‌ ట్రోఫీ సహా భవిష్యత్‌ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేస్తామని హాకీ ఇండియా ప్రకటించింది.