నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

Batthukamma Sarees
Batthukamma Sarees

హైదరాబాద్‌: బతుకమ్మ పండుగను పురస్కరించకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చీరల
పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి ఆరంభం కానుంది. రాష్ట్రంలో కోటి 40 లక్షల మంది మహిళలకు
ఈ చీరలను అందజేయనున్నారు. రూ.222కోట్ల విలువైన చీరలను ఇందుకోసం ప్రభుత్వం సిద్ధం చేసింది. మహిళలకు
నచ్చేలా 500 రకాల డిజైన్‌లలో చీరలను అందుబాటులో ఉంచారు. 18 సంవతసరాలు కలిగి ఉండి, రేషన్‌ కార్డు
కలిగి ఉన్న మహిళలందరికీ చీరలను పంపిణీ చేయనూన్నరు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక పంపిణీ కేంద్రాలను
ఏర్పాటే చేస్తారు.