నేటి నుంచి ఏపి ఎంసెట్ ప‌రీక్ష‌లు

EAMCET
EAMCET

హైదరాబాద్ : నేటి నుంచి ఏపీ ఎంసెట్-2018 ఇంజినీరింగ్ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న ఇంజినీరింగ్ ఆన్‌లైన్ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ నెల 25న వ్యవసాయం, వైద్య విద్య పరీక్ష జరగనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 131 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, హైదరాబాద్‌లో 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉర్దూ అనువాదం ఎంపిక చేసుకున్న వారికి కర్నూల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.  రెండు విడతల్లో(మొదటి విడత ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, రెండో విడత మ. 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు) ఆన్‌లైన్ పరీక్షలకు 2,76,058 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,99,332 మంది, వ్యవసాయం, వైద్యవిద్య విభాగంలో 76,631 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఏపీ ఎంసెట్‌కు సంబంధించి సందేహాల నివృత్తికి 0884-2340535 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు.