నేటి నుంచి ఎన్టీఆర్‌ కప్‌ టెన్నిస్‌

TENNIS
TENNIS

నేటి నుంచి ఎన్టీఆర్‌ కప్‌ టెన్నిస్‌

గుంటూరు : ఇక్కడి ఎన్టీఆర్‌ స్టేడియంలో గురువారం నుంచి ఎన్టీఆర్‌ కప్‌ ఆలిండియా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ జరగనుంది.ప్రతి ఏటా ఎన్టీఆర్‌ జయంతికి ముందు టెన్నిస్‌ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఎన్టీఆర్‌ టెన్నిస్‌ క్లబ్‌ కార్యదర్శి నల్లబోతుల శ్రీనివాస రావు వెల్లడించారు. పోటీలను ఎన్టీఆర్‌ స్టేడియం, ఎల్వీఆర్‌ క్లబ్‌, నార్త్‌ క్లబ్‌,ఆఫీసర్స్‌ క్లబ్‌లలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు జివి ఆంజనేయులు, మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, కమిషనర్‌ అనురాధ హాజరవుతున్నట్టు పేర్కొన్నారు.