నేటితో ముగియ‌నున్న తెలంగాణ అసెంబ్లీ!

TS ASSEMBLY
TS ASSEMBLY

హైద‌రాబాద్ః 50 రోజుల పాటు సుదీర్ఘంగా సాగుతుందని భావించిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నేటితో ముగించాలని సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రోజుల సభ నిర్వహించాల్సిన అవసరం లేదని, చర్చించాల్సిన అంశాలు కూడా ఏమీ లేవని శాసనసభా పక్ష నేత హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలతో భేటీ అయిన ఆయన, చర్చించాల్సిన అంశాల లేవని చెబుతూ, సభను ముగిద్దామని ప్రతిపాదించగా, కాంగ్రెస్, బీజేపీలు అంగీకారం తెలిపాయి. అయితే, ఎస్సీల సంక్షేమంపై చర్చిద్దామని, అందుకు సమయాన్ని కేటాయించాలని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు హరీశ్ అంగీకరించారు. ఈ అంశంపై చర్చ అనంతరం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.