నెల రోజుల పాటు గ్రామాల్లో సైకిలు యాత్ర‌

AP Minister Devineni Uma
AP Minister Devineni Uma

మైల‌వ‌రంః కృష్ణా జిల్లా మైలవరం గొల్లపూడిలో మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు శనివారం ఉదయం సైకిల్‌యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలరోజుల పాటు అన్ని గ్రామాల్లో సైకిల్‌యాత్ర చేపడతామన్నారు. ఈ యాత్రలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. విభజన చట్టంలోని అంశాలు నెరవేర్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. నాలుగేళ్లలో టీడీపీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని మంత్రి దేవినేని పేర్కొన్నారు.