నెలా ఖరుకు వస్తున్న లిటిల్‌ స్టార్స్‌

Little Star
మహమ్మద్‌ అఫ్ఫాన్‌ సమర్పణలో డివిజన్‌ ఇండియా బ్యానర్‌పై అనంతపురం ఫిల్మ్‌ సొసైటీ సహకారంతో రషీద్‌ బాషా దర్శకత్వంలో ఎన్‌.ఇబ్రహీం నిర్మించిన బాలల చిత్రం లిటిల్‌ స్టార్స్‌ సెన్సార్‌ కార్యక్రమాలు ముగించుకుని జనవరి చివరి వారంలో రిలీజ్‌ చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు.లక్ష్య సాధనలో అవందాలను ఎదుర్కొని విజయతీరం చేసిన ఆరుగురు చిన్నారులు చేసిన సాహసాలు ఏ విధంగా ఆదర్శప్రాయంగా నిలిచిస్ఫూర్తిని రగిలించాడం తెలియజేసే కథ రూపొందించామని, ఈ చిత్రాన్ని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా చూపించవలసిన చిత్రంగా మలిచామని చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు. దడ సంకల్పంతో ప్రయత్నిస్తే అసాధ్యాన్ని కూడా సాధించవచ్చన్న అబ్దుల్‌ కలం గారి ఆశయం మాకు స్ఫూర్తిదాయకం అందుకూ మా ఈ లిటిల్‌ స్టార్స్‌ చిత్రాన్ని కలం గారికి అంకితం ఇస్తున్నాము అన్నారు.