నెలాఖ‌రులోగా లోక్‌పాల్‌

lokpal
lokpal

లోక్‌పాల్‌ నియామకంపై ముందడుగు
న్యూఢిల్లీ: లోక్‌పాల్‌నియామకంపై కేంద్రం మరో అఈడుగు ముందుకేసింది. ఈనెలాఖరులోగా లోక్‌పాల్‌ సభ్యులను నియమించాలని కేంద్రం భావిస్తోంది. లోక్‌పాల్‌ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనాప్రకాశ్‌ దేశా§్‌ునేతృత్వంలోని ఎంపిక కమిటీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఛైర్మన్‌,సబు యల నియామకంకోసం గురువారంనుంచి 22 వరకూ ఈ కమిటీ దరఖాస్తులు స్వీకరిస్తుందని వెల్లడించింది అనంతరం వీటినిపరిశీలించి ఉన్నతస్థాయి కమిటీకి పంపిస్తుంది. లోక్‌పాల్‌ నియామకంపై ఎంపికకమిటీ అనుసరిస్తున్న ధోరణిపై ఇటీవలే సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. ఫిబ్రవరినెలాఖరులోగా లోక్‌పాల్‌ ప్యానెల్‌ కమిటీ సభ్యుల పేర్లను సిఫారసు చేయాల్సిందిగా న్యాయస్థానం ఎంపిక కమిటీకి గడువు విధించింది. సభ్యులను ఎంపికచేసుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిబ్బందినిఏర్పాటుచేయాలని సుప్రీం చీఫ్‌జస్టిస్‌ రంజన్‌ గొగో§్‌ుతోకూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి తదుపరి విచారణను మార్చి ఏడవ తేదీకి వాయిదావేసింది. సుప్రీం కోర్టు తీర్పునేపథ్యంలో సమావేశమైన ఎంపిక కమిటీ దరఖాస్తులు ఆహ్వానించేందుకు నిర్ణయించింది. లోపాల్‌, లోకాయుక్త చట్టాలను 2014లోనే అమలుకు వచ్చినప్పటికీ ఇప్పటికీ నియామకాలు జరపకపోవడంపై సుఏప్రీం సీరియస్‌ అయింది. లోక్‌పాల్‌ చట్టం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా సభ్యులు,ఛైర్మన్‌ ఎంపిక ఉంటుందని వెల్లడించారు. లోక్‌పాల్‌ ఎంపిక కమిటీకి ప్రధాని అధ్యక్షతన పనిచేస్తుంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ఖర్గేను ప్రత్యేక ఆహ్వానితునిగాచేర్చడంపై ఆయన నిరసన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. దేశంలో అవినీతిని వ్యతిరేకంగా భారత యుద్ధం అన్న నినాదంతో సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే పోరాడినందువల్లనే 2013లో లోక్‌పాల్‌, లోకాయుక్త చట్టం వచ్చింది. యుపిఎ ప్రభుత్వం కూలిపోవడానికి అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామన్న నరేంద్రమోడీ నేతృత్వంలో బిజెపి అదికారంలోనికి రావడానికి అన్నాహజారే దీక్ష తోడ్పడిందనే చెప్పాలి. అవినీతి అంతుచూస్తానన్న నరేంద్రమోడీ నాలుగున్నరేళ్లపాలనలో కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను నియమించలేకపోయారు. గుజరాత్‌ సీఎంగా ఉన్న కాలంలో ఆరాష్ట్రంలో లోకాయుక్త నియామకానికి ససేమిరా అంగీకరించలేదు. ఇపుడు లోక్‌పాల్‌పై సాక్షాత్తూ సుప్రీం చురకలు వేయడంతో ఇపుడు మోడీ ప్రభుత్వానికి లోక్‌పాల్‌ నియామకం అనివార్యం అయింది.