నెలవారి పింఛన పరిమితి రూ.10వేలు!

pension
pension

కొత్త బడ్జెట్‌కు పిఎఫ్‌ఆర్‌డిఎప్రతిపాదన
న్యూఢిల్లీ: పించన్‌ క్రమబద్దీకరణ ప్రాధికార సంస్థ (పిఎప్‌ఆర్‌డిఎ) నెలవారీ పింఛన్‌ పరిమితిని పదివేలకు పెంచాలని ప్రతిపాదించింది. కొత్త బడ్జెట్‌లోనే ఈమార్పులు వెల్లడించే అవకాశం ఉంది. అంతేకాఉండా పిఎఫ్‌ చందాదారులసంఖ్యకూడా అటల్‌పెన్షన్‌యోజన కింద 1.5 కోట్లమందికి చేరుతారని అంచనావేసింది. మార్చినెలాఖరునాటికే ఈ చందాదారులు భారీగా ఉంటారని వెల్లడించింది. గత ఏడాది 97లక్షలకు చేరుకున్న చందాదారులు ఈసారి 1.5 కోట్లకు పెరుగుతారని అంచనావేసుత్నఆ్నరు ఇప్పటికే 44 లక్షల అటల్‌పెన్షన్‌యోజన చందాదారులు డిసెంబరునాటికిచేరారని, ఈ సంఖ్య 50 లక్షలకుపైబడి పెరుగుతుందని పిఎఫ్‌ఆర్‌డిఎ సభ్యుడు సప్రతిమ్‌ బంధోపాధ్యా§్‌ు వెల్లడించారు. ఎపివైను నాలుగుశాతం జనాభాకు అంటే 40 కోట్లమందికిచేర్చాలని నిర్ణయించినట్లు అంచనా. 18-40వయసుమధ్యలోనే 40 కోట్లమందినిచేరుస్తామని చెపుతున్నారు. ప్రస్తుతం 3.5శాతంమందికంటే పెంచుతామని బంధోపాధ్యా§్‌ు వెల్లడించారు. అయితే రానున్న బడ్జెట్‌లో అటల్‌పెన్షన్‌యోజనకు కొన్ని మార్పులుచేర్పులు ఉంటాయని చెపుతున్నారు. పింఛను మొత్తం నెలకు రూ.10వేలకు పెంచుతామని ప్రస్తుతం ఉన్న ఐదువేలనుంచి మరింతపెంచాలనిచూసుత్నఆ్నరు. ప్రస్తుతం ఐదు శ్లాబ్‌ల పెన్షన్‌నడుస్తోంది. 1000 నుంచి 5000నెలసరి లభిస్తుంది. మార్కెట్‌నుంచి వచ్చే పీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఐదువేల రూపాయలు 60 వయసు ఉన్నవారికి 20నుంచి 30 ఏళ్లపాటు చెల్లించాలనినిర్ణయించారు.పిఎప్‌ఆర్‌డిఎ పరంగాచూస్తే 50 ఏళ్లకు పెంచాలని, ఇపుడున్న పరిమితి 40 నుంచి 50 ఏళ్లకు పెంచాలని గరిష్ట వయసుపరిమితిని నిర్ణయించింది. ఎపివైకు ప్రస్తుతం వయోపరిమితి 18నుంచి 40గా ఉంది. ఈ పరిమితిని 18 నుంచి 50 ఏళ్లకు పెంచాలనినిర్ణయించారు. అపివై పథకం 2015 జూన్‌ ఒకటవ తేదీనుంచి అమలులోనికి వచ్చింది. ఈ స్కీం కింద చందాదారు కనీస పింఛన్‌ వెయ్యినుంచి ఐదువేలవరకూ పొందగలుగుతారు. 60ఏళ్లు దాటిన వెంటనే ఈపరిమితి వర్తిస్తుంది. 2017-18లో పిఎప్‌ఆర్‌డిఎకు ఈ కొత్తపథకంలో 50 లక్షలమంది కొత్త చందాదారులు వచ్చిచేరినట్లు పిఎప్‌ఆర్‌డిఎ సభ్యుడు వెల్లడించారు.