నెలరోజులు అసెంబ్లీ

KCR11
TS CM Kcr

నెలరోజులు అసెంబ్లీ

27 నుంచి ప్రారంభం..  26న బిఎసి సమావేశంలో అజెండా నిర్ణయం
అన్ని విషయాలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం: సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌: ఈనెల 27 నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు నిర్వహించా లని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాదించింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపింది. 26న బిఏసి సమావేశం నిర్వహించి, ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే విషయంపై చర్చించనున్నారు. నెలరోజుల పాటు సమావేశాలు నిర్వహించా లని ప్రభుత్వం నుంచి బిఏసిలో ప్రతిపాదించాలని 15 నుంచి 20 రోజుల పాటు పనిదినాలు ఉండేలా షెడ్యూల్‌ ఖరారు చేయాలని అధికార పక్షం నుంచి కోరాలని ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు.ప్రభుత్వ ప్రతిపాదనను అసెంబ్లీ కార్యదర్శి వేదాంతం నర్సింహాచార్యులకు పంపించారు. శాసనసభ ఎన్ని రోజులు జరిగితే, శాసనమండలి కూడా ఎన్ని రోజులు జరపాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. శాసన సభల చర్చ జరిగిన ప్రతీ అంశంపైనా మండలిలో కూడా చర్చ జరగాలన్నారు.

అసెంబ్లీసమావేశాల నిర్వహణపై ప్రగతి భవన్‌లో మంగళవారం వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ఈ సంద ర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన అన్ని విషయాలపై కూలంకషంగా చర్చ జరగాలని చెప్పారు. ‘అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలి. సభ్యులు లేవనెత్తిన ప్రతీ అంశంపై జవాబు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ అంశంపైనా చర్చకు సిద్ధం, ప్రజలకు అన్ని విషయా లను అసెంబ్లీ ద్వారా వివరించాలి. దీనికోసం మంత్రులు సిద్ధం కావాలి. ప్రతిపక్ష సభ్యులు ఏ అంశంపై ఏ ప్రశ్నలు వేసినా ప్రభు త్వం నుంచి జవాబు చెప్పడానికి సిద్దంగా ఉన్నాం. ప్రజల కోసం దేశంలో మరెక్కడా అమలు చేయని ఎన్నో కార్యక్రమాలు చేప ట్టాం, వాటి గురించి వివరించాలి. సభ్యుల సందేహాలను నివృత్తి చేయాలి.విలువైన సూచనలు స్వీకరించాలి.

అంతిమంగా అసెంబ్లీ నుంచి ప్రజలకు కావాల్సిన సమా చారం పోవాలి. ఎన్ని రోజులు సభ నిర్వహించినా ప్రభుత్వం సిద్దంగా ఉంది. నెల రోజల పాటు సభ నిర్వహించాలని ఆధికార పక్షం నుంచి కోరుదాం.ప్రతిపక్ష సభ్యులు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నిర్వహిం చడానికి మనకేమీ అభ్యంతరం లేదు. ఎవరు ఏ అంశాన్ని తీసు కున్నామనకు అభ్యంతరం లేదు. అన్ని విషయాలపై మనం సిద్దంగా ఉన్నాం. సభ హుందాగా నడవాలి. ప్రతీ అంశంపై చర్చ జరగాలిఅని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మాతృభాష పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యాలపై కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇంటర్మీడియట్‌ వరకు ఖచ్చితంగా తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండాలనే నిబంధన వల్ల మాతృభాష పరిరక్షణ జరగడంతో పాటు అనేక మంది తెలుగు పండిట్లకు ఉద్యోగావకాశం కూడా లభిస్తుందన్నారు. ప్రభుత్వం స్థాపించిన రెసిడెన్షియల్‌ స్కూళ్లలో కూడా తెలుగును ఒక సబ్జెక్టుగా బోధిం చనున్నట్లు వెల్లడించారు. హైదరా బాద్‌ లో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలపై కూడా సభలో చర్చ జరగాలని సిఎం చెప్పారు.